ప్రకాశం: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం జీఎస్టీ తగ్గించిందని జీఎస్టీ కమిషనర్ నరసింహులు తెలిపారు. మార్కాపురంలో మంగళవారం పలు షాపులను సందర్శించి షాపు నిర్వాహకులకు జీఎస్టీ తగ్గింపు కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపును షాపు నిర్వాహకులు తప్పకుండా అమలు చేయాలని సూచించారు.