ప్రకాశం: కనిగిరిలో ఫేస్బుక్లో పరిచయంతో కోటి పదహారు లక్షల రూపాయలను ద్విచక్ర వాహన షోరూం యజమాని వెంకటేశ్వరరెడ్డి పోగొట్టుకున్నాడు. వివరాల్లోకెళ్తే బంగారం బాక్సుల తయారీ పేరుతో శరణ్య రెడ్డితో ఫేస్బుక్లో పరిచయమై మహిళ అతనిని మోసం చేసింది. దీంతో బాధితుడు కనిగిరి పోలీసులను ఆశ్రయించాడు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.