KRNL: దేవనకొండలో ఇవాళ మండల టీడీపీ కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మిని కలిశారు. అధిక వర్షాల కారణంగా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉచ్చిరప్ప, శాంతి కుమార్ పాల్గొన్నారు.