KNR: సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన సింగిల్ విండో ఛైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి తల్లి కొత్త సుశీల దేవి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మంగళవారం వారి నివాసానికి వెళ్లారు. అక్కడ సుశీల దేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.