MDK: చేగుంట మండలం వడియారం శివారులోని ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కంపెనీలో ముగ్గురు కార్మికులను అక్రమంగా బదిలీ చేశారని కార్మికులు ఆందోళన చేపట్టారు. 14 ఏళ్లుగా డ్యూటీ చేస్తున్న ముగ్గురు పర్మనెంట్ కార్మికులను అక్రమంగా బదిలీ చేశారని నిరసిస్తూ బీఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో కంపెనీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు.