NZB: రుద్రూర్ ఆదర్శ పాఠశాల/ కళాశాలలో గణితం బోధించుటకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాఘవేందర్ తెలిపారు. ఇంటర్మీడియట్ బోధకులుగా మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ ధ్రువపత్రాలతో గురువారం ఉదయం పది గంటలకు డెమోకు హాజరు కావాలన్నారు.