కృష్ణా: బంటుమిల్లి మండలం చిన్న తమ్ముడి గ్రామంలో ఏపీ రీ సర్వే ప్రాజెక్ట్ భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన గ్రామ సభను మంగళవారం నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. త్వరలో సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.