KDP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్‌పై జరిగిన దాడిని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు హేయమైన చర్యగా ఖండించారు. ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం బద్వేలులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ మేరకు దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్‌కు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.