PLD: చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో పారిశుధ్య పనులను శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు మంగళవారం పర్యవేక్షించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండి, పిచ్చి మొక్కలు పెరిగి దోమలు పెరిగే అవకాశం ఉండటంతో చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టారు. ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణకు గుంతలను డస్ట్‌తో పూడ్చే చర్యలు తీసుకుంటున్నామన్నారు.