RR: అమెరికా టెక్సాస్లోని డల్లాస్ నగరంలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో ఎల్బీనగర్కి చెందిన యువకుడు చంద్రశేఖర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చంద్రశేఖర్ కుటుంబసభ్యులను పరామర్శించి, చంద్రశేఖర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ దుండగుల కాల్పుల్లో యువకుడు మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు.