AKP: నక్కపల్లి మండలం ఒడ్డిమెట్టలో మండల స్థాయి అధికారులు పర్యటించి పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదుపై మంగళవారం విచారణ నిర్వహించారు. గ్రామంలో మంచినీటి బావిని మూసివేయాలని వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపారు. బావిని అలాగే ఉంచాలని చుట్టుపక్కల వారు అధికారులకు తెలియజేశారు. నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని ఎంపీడీవో సీతారామరాజు తెలిపారు.