E.G: తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు, పరీక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు.