SRCL: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సిరిసిల్ల కలెక్టర్ ఎం హరిత అన్నారు. వేములవాడలోని ఆలయ విస్తరణ పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిర్మాణం పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. R&B CO రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.