AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో సినీఫక్కీలో జరిగిన మోసం వెలుగు చూసింది. ‘బ్లాక్ మనీని, వైట్ మనీగా మార్చుకునేందుకు వచ్చామని చెప్పిన.. ముగ్గురు ఢిల్లీ యువకులు ఓ వ్యక్తి నుంచి రూ.4.50 లక్షలు దోచుకెళ్లారు. న్యూస్ పేపర్ల మధ్య సౌదీ కరెన్సీ పెట్టి నోట్లకట్టగా నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు’ అని DSP కృష్ణ మోహన్ వెల్లడించారు.