PLD: సత్తెనపల్లి పట్టణం 12వ వార్డులో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తూ విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.