కోనసీమ: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈనెల 9వ తేదీన రాజోలులో పర్యటిస్తారని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. శంకరగుప్తం డ్రెయిన్ వలన ముంపునకు గురవుతున్న ప్రాంతాలను, పాడైపోయిన కొబ్బరి తోటలను మంత్రి పరిశీలిస్తారని తెలిపారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పర్యటిస్తారని ఎమ్మెల్యే దేవా తెలిపారు.