TPT: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు కావాలని, ఆరోగ్యం బాగుండాలని వైసీపీ నేతలు, కార్య కర్తలు పూజలు చేశారు. ఇందులో భాగంగా పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీలో వెలిసిన శ్రీవల్లి దేవాసేన సుబ్రమణ్య స్వామి ఆలయం దగ్గర స్వామికి పూజ చేసి 516 కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.