KDP: మైదుకూరు పట్టణం మున్సిపాలిటీగా మారిన తర్వాత ప్రజలకు మౌలిక వసతులు అందించడంలో అధికారులు విఫలమయ్యారని రైతు సేవా సమితి అధ్యక్షుడు ఏవి. రమణ తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా ప్రధాన రోడ్ల డ్రైనేజ్ ఆక్రమణ తొలగింపు, పందులు, కుక్కల నివారణ, దోమల నియంత్రణపై కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కాగా, పరిష్కారం లభించకపోతే ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.