VSP: రెండు నెలల్లో దేవాదాయభూముల సమస్య పరిష్కరిస్తానని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మంగళవారం వెంకటేశ్వర మెట్ట ఆలయ భూములను ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. బాధితులు 22(A) భూమి సమస్య, బ్యాంక్ లోన్, ఇళ్ల మరమ్మత్తుల సదుపాయం కోసం దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు.