MDK: చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో సోమవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాలు.. ఉప్పరి యాదగిరి అనే వ్యక్తిని తమ సమీప బంధువులు పాత కక్షలు నేపథ్యంలో హత్య చేసినట్లు తెలిపారు. హత్య చేసిన నిందితులు ఉప్పరి శ్యాములు, ఉప్పరి రాములు, ఉప్పరి ఎల్లం అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.