MDK: బెస్ట్ అవైలబుల్ స్కూల్ (BAS) పథకానికి సంబంధించి రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రూ.250 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని గిరిజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. స్కూల్ యాజమాన్యాలు నిధుల లేకపోవడంతో విద్యార్థులను తిరస్కరించడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.