అన్నమయ్య: రాజంపేట పట్టణ కేంద్రంలోని బైపాస్ రోడ్లో మంగళవారం వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద వాల్మీకి జయంతి వేడుకలు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నల్లబోతుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాంనగర్ నుంచి రమేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వాల్మీకి యువకులు వాల్మీకి చిత్రపటంతో డప్పు వాయిద్యాల మధ్య చిత్రపటాన్ని ఊరేగిస్తూ వాల్మీకి విగ్రహం వరకు చేరుకున్నారు.