MDK: చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్ సందర్శించారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ఆశాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవల సంఖ్య పెంచాలని, గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవం పై అవగాహన కల్పించాలన్నారు.