AP: అనకాపల్లి జిల్లా మాకవరపాలెం పర్యటనకు ఈ నెల 9న మాజీ సీఎం జగన్ రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుహిన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ‘విశాఖ నుంచి మాకవరపాలెం వరకు 63కి.మీ రోడ్డుమార్గం ద్వారా జగన్ వచ్చేందుకు వైసీపీ నేతలు దరఖాస్తు చేశారు. దీనివల్ల ట్రాఫిక్, ప్రజలకు ఇబ్బంది కలగకుండా విశాఖ నుంచి మాకవరపాలేనికి హెలికాప్టర్లో వచ్చేలా జగన్ చొరవచూపాలి’ అని ఎస్పీ తెలిపారు.