PDPL: జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కందుల సదాశివ నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సదాశివ మాట్లాడుతూ.. జిల్లాలో బీసీల హక్కుల సాధన, విద్యా అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, చట్టసభల్లో సముచిత ప్రతినిధిత్వం కోసం కృషి చేస్తానని వెల్లడించారు.