కృష్ణా: అవనిగడ్డ బేతేలు సంఘం వారు పాత ఎడ్లంక గ్రామానికి చెందిన 450 వరద బాధిత కుటుంబాలకు మంగళవారం బియ్యం, సరుకులు అందచేశారు. పాస్టర్ పాల్ మెయార్, జార్జ్ ముల్లర్ రూ.10 లక్షలు వ్యయంతో ఈ సహాయం అందచేశారు. పాస్టర్ పాల్ మేయర్ మాట్లాడుతూ.. ప్రభువైన యేసుక్రీస్తు సూచించిన మార్గంలో ఆపదలో ఉన్నవారికి చేయూత అందించడం జరిగిందన్నారు.