ప్రకాశం: ఒంగోలు పట్టణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై జరిగిన దాడిని ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎస్పీ, కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించనున్నట్లు నాయకులు తెలిపారు.