SKLM: ఎండీయూ ఆపరేటర్స్‌ను రోడ్డున పడేయటం బాధాకరమని, ఎండీయూ ఆపరేటర్స్ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఛైర్మన్‌కు చెప్పారు.