TG: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన డివిజన్ కమిటీ కార్యదర్శి మంద రూబెన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఎదుట మంద రూబెన్ జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అందించే పునరావాస పథకాలు రూబెన్‌కు వర్తించనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.