KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే CPM అభ్యర్థులనే గెలిపించాలని ఆ పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం తమ్మినేని సుబ్బయ్య భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయం కోసం పాటుపడి CPM సత్తా చాటాలని అన్నారు.