KMR: బీర్కూర్ మండలంలో వీధి కుక్కలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం బీర్కూరు మండలం బరంగ్ఎడ్దిలో శేష బాయి అనే వృద్ధురాలిపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బరంగ్ఎడ్దిలో కొన్ని నెలల్లోనే పలువురు వీధి కుక్కల బారిన పడి గాయాల పాలయ్యారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.