W.G: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం భీమవరం రానున్నారు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు కుమారుడి వివాహానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3:25 గంటలకు భీమవరంలో హెలికాప్టర్ ద్వారా చేరుకుని అక్కడనుండి పెదామిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుంటారన్నారు.