HYD: బీసీ వ్యతిరేకులు కొంతమంది ప్రభుత్వం తీసుకొచ్చిన 9 జీవోలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అన్నారు. అంబర్ పేటలోని పూలే విగ్రహం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావుతో కలిసి నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం రావాల్సిన విద్యా, ఉద్యోగ రంగాల్లో వాటా ఒక హక్కుగా దక్కాలన్నారు.