GNTR: తుళ్లూరు(M) సీడ్ యాక్సిస్ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సీడ్ యాక్సిస్ రోడ్డు మీద అమరావతి వైపు వెళ్తున్న కారు, అబ్బరాజుపాలెం నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకి గాయాలయ్యాయి. తుళ్లూరు ప్రాథమిక ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.