ప్రకాశం: ప్రతి ఒక్కరికి వ్యాయామం అవసరమని మానసిక నిపుణులు నారాయణ లావణ్య తెలిపారు. మంగళవారం పెద్దారవీడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా ఉత్తేజంగా ఉంటామని విద్యార్థులకు వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి. పీబే, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.