KKD: తమ డిమాండ్లు సాధించే వరకు చేపల వేటకు వెళ్లబోమని యు.కొత్తపల్లి మత్స్యకారులు ప్రారంభించిన వేట నిషేధంపై ప్రభుత్వం స్పందించింది. సమస్య పరిష్కారం కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీలో మత్స్య, పరిశ్రమల శాఖ కమిషనర్లు, పీసీబీ మెంబర్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, కలెక్టర్ సూచించిన మత్స్యకార పెద్దలు ఉంటారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.