అన్నమయ్య: మదనపల్లెలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఇవాళ బహుజన యువసేన ఆధ్వర్యంలో మూతికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో బివైఎస్ అధ్యక్షుడు పునీత్ కుమార్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై ఓ న్యాయవాది దాడికి యత్నించడాన్ని తాము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాగా, మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు.