హన్మకొండలో చారిత్రాత్మకమైన స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలోని సిద్దేశ్వర స్వామికి ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. నేడు పౌర్ణమి తిధి, మంగళవారం సందర్భంగా సిద్దేశ్వరునికి ప్రత్యేక అన్నపూజ నిర్వహించి, వివిధ రకాల పూలు పూలమాలలతో స్వామివారిని అలంకరించారు. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.