TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణను వాయిదా వేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావు సహా పలువురు దాఖలు చేసిన ఈ పిటిషన్ల తదుపరి విచారణను హైకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సమయం ఇచ్చింది.