NLR: 2025 స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ భాగంగా జిల్లాలో స్వచ్ఛ మున్సిపాలిటీగా కావలి పురపాలక సంఘం ఎంపికయ్యింది. కలెక్టర్ హిమాన్షు శుక్ల, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా కావలి మున్సిపల్ కమిషనర్ జి. శ్రావణ్ కుమార్ స్వచ్ఛ అవార్డును అందుకున్నారు. కావలి పురపాలక స్వచ్ఛ వారియర్స్ అవార్డులు పారిశుద్ధ్య కార్మికులు భూపతి, అంకయ్య అందుకున్నారు.