SRD: కంగ్టి మండలం రాసోల్లో మంగళవారం వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వాల్మీకి చౌక్ వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం చేశారు. అనంతరం వాల్మీకి ఋషి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాశీరాం, పెంటన్న, శంకర్, గుండన్న, సిద్దు, శివాజీ, తుకారాం తదితరులు పాల్గొన్నారు.