హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన పుట్టపర్తి యాత్రకు వెళ్లు సమయంలో ఓవర్స్పీడ్ ఫైన్ పడింది. గద్వాల జిల్లా, ఉండవల్లి సమీపంలో ఆయన కారు 114 Kmph వేగంతో వెళ్తున్నట్లు స్పీడ్ గన్ గుర్తించింది. దీంతో రూ.1,035 జరిమానా విధించారు. కాగా, విజయ్ తిరుగు ప్రయాణంలో ఈ ఉండవల్లి ప్రాంతంలోనే కారు ప్రమాదం జరిగింది.