KRNL: ఆదోనిలోని మిల్టన్ పాఠశాలలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ రమేష్ బాబు, సీఈవో వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ నాగరాజు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఇవాళ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వాల్మీకి మహర్షిపై సాంస్కృతిక ప్రదర్శనలు, శ్లోకపఠనం, ప్రసంగాలు అందించగా, పాఠశాల పెద్దలు ఆయన జీవితం నుండి నైతిక విలువలు, ధర్మం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.