NZB: దళారులను నమ్మి మోసపోకుండా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మి లాభం పొందాలని రెవిన్యూ అధికారిణి నాగమణి సూచించారు. నేడు గోవూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏ గ్రేడ్ రకానికి రూ.2,389, బీ గ్రేడ్ రకానికి రూ.2,369గా ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోవూర్ సహకార సంఘ సభ్యులు, సిబ్బంది, రైతులు ఉన్నారు.