CTR: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు. చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలోని ఆయన నివాసంలో మంగళవారం నియోజకవర్గంలోని పలువురు ప్రజలు కలిసి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన ఆయన సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.