చిత్తూరు నగరంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో సంచార ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నట్లు తపాలా శాఖ చిత్తూరు డివిజన్ సూపరింటెండెంట్ లక్ష్మన్న ఒక ప్రకటనలో తెలిపారు. 8న క్యాంఫర్డ్ పాఠశాల(గంగనపల్లి), బీవీరెడ్డి పాఠశాలలో, 9న రెయిన్బో స్కూల్, బృందావన్ పాఠశాలలో, 10న న్యూయార్క్ పాఠశాల, కేశవరెడ్డి పాఠశాల(న్యూబాలాజీ కాలనీ)లో శిబిరాలు జరుగుతాయని చెప్పారు.