KRNL: జిల్లాలో ఇవాళ బీసీ శాఖ మంత్రి సవితను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని ఒక హోటల్లో జరిగిన ఈ భేటీలో మంత్రి సవితకు పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ కార్యక్రమాలు, సంఘాల అభివృద్ధి, చేనేత రంగ ప్రోత్సాహంపై విస్తృతంగా చర్చలు జరిపి భవిష్యత్లో అమలు చేయాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు.