ప్రకాశం: కంభం మండలంలోని కందులాపురం గ్రామ పంచాయతీలో గురుకుల పాఠశాలలో SGSS షెడ్యూల్ ప్రకారం మంగళవారం పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎంపీడీవో వీరభద్రాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, పంచాయతీ సిబ్బంది, పాల్గొన్నారు.