కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో ‘ది ఇండియా స్టోరీ’ మూవీ రాబోతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు కాజల్ ప్రకటించారు. ఈ మేరకు సెట్స్ నుంచి దిగిన ఫొటోలు షేర్ చేశారు. ‘ఈ శక్తివంతమైన కథను మీకు స్క్రీన్‌పై చూపించే వరకు నేను వేచి ఉండలేకపోతున్నా’ అంటూ రాసుకొచ్చారు. డీకే చేతన్ తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ లాయర్‌గా కనిపించనున్నారు.