ADB: ఇంద్రవెల్లి మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన పూర్ణ అనే గర్భిణీకి మంగళవారం పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. ఈ మేరకు ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు EMT విజయ్ కుమార్ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.